సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దసరా పండుగకు వరుస సెలవులు రానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులకు ముందు అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి. దీంతో అక్టోబర్ 10 నుంచే పాఠశాలలకు సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 21 వరకు కొనసాగనున్నాయి. దసరా సెలవులు ముగిసిన అనంతరం అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో రేపు శుక్రవారం (అక్టోబర్ 9) మధ్యాహ్నం నుంచే హాస్టళ్లు, కాలేజీలు, స్కూళ్లకు సెలవులు రానున్నాయి. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఈ సెలవుల కోసం ముందుగానే దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
