సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి సమీపంలోని ‘కాళ్ళ’ మేజర్ పంచాయతీలో దాతల సహకారంతో అభివృద్ధి చేసిన నూతన కాళ్ళ బస్సు స్టాండ్‌ను నేడు, గురువారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నేతలు , స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అలాగే కాళ్ళ మండలం, ఏలూరుపాడు గ్రామంలో “National Ayush Mission” క్రింద మంజూరైన 30 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన “ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల” నూతన భవనాన్ని రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు. అనంతరం “వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ (VB-G RAM G) – పల్లె పండుగ 3.0”లో భాగంగా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
