సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ వెటకారం మాటలకు నవ్వుల జోష్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీవిష్ణు. తాజాగా నక్సల్స్ నేపథ్యంలో కామిడి టచ్ చేసి‘కామ్రేడ్ కల్యాణ్’. నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిలో మహిమా నంబియార్ కథానాయిక. రాధిక, షైన్ టామ్ చాకో, సాయిచంద్,సత్య ,ప్రధాన పాత్ర దారులుగా జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహించారు. ‘అదుర్స్’ మాటల రచయిత కోన వెంకట్ సమర్పణలోనిర్మించారు. మరి కధ విషయానికి వస్తే.. .1990ల ప్రాంతంలో ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో సాగే చిత్రమిది. అక్కడ మాడుగుల గ్రామంలో టి.కల్యాణ్ (శ్రీవిష్ణు) ఓ మధ్య తరగతి కుర్రాడు. ఆ ఊళ్లో అలంకార్ టాకీస్‌ను లీజుకు తీసుకుని సినిమాలు ఆడిస్తూ.. జీవితం సాగిస్తుంటాడు. తల్లి సరస్వతమ్మ(రాధిక) అంటే అతనికి ప్రాణం. ఆమెకు హీరో బాలకృష్ణ సినిమాలన్నా పిచ్చి.. అతని సినిమా విడుదలైన ప్రతిసారీ ఎవరో ఒకరితో గొడవపెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటుంది. అలా ఓసారి పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకుని వస్తుండగా అనారోగ్యం పాలవ్వడంతో దారిలో ఒరియా అమ్మాయి సితార(మహిమా) ప్రాణాలు కాపాడుతుంది. కల్యాణ్ ఆమెనే పెళ్లాడాలనుకుంటాడు. అదే ప్రాంతలో నక్సల్‌ను ఏరిపారేయడానికి ఐపీఎస్ అధికారి జార్ట్ కుట్టి (షైన్ టామ్ చాకో) అపాయింట్ అవుతాడు. అక్కడ మాస్టర్ సాయిచంద్ దళానికి పోలీసులకు మధ్య పోరాటం జరుగుతుంటుంది. మరోపక్క కళ్యాణ్ ప్రేమించిన సితార కుటుంబం ఓ ఇబ్బంది నుండి గట్టెక్కాలంటే రూ.5 లక్షలు కావాలి. దానికోసం కల్యాణ్‌గా ఉన్న వ్యక్తి కామ్రేడ్‌గా ఎలా మారాడు? అడవిలో కల్యాణ్ ఎదుర్కొన్న పరిణామాలు ఈ సినిమా కధ .. సినిమా ఎలాగుంది? అంటే.. సాధారణంగా అన్నల సినిమాలంటే సీరియస్‌గా సాగుతుంటాయి. అయితే ఇది అందుకు భిన్నంగా వినోదాత్మకంగా సాగే సినిమా ఇది. ఫస్టాఫ్ అంతా నవ్వుల జోష్ నింపుతుంది. ఇక పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ, ఇంటర్‌వెల్‌కు ముందు పది నిమిషాల సన్నివేశాలు, ఊహించని ఓ ఘటనతో సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకెండాఫ్‌లో కాస్త తడబడింది. మంత్రి (శ్రీకాంత్ అయ్యంగార్) కిడ్నాప్‌తో మళ్లీ కథ కామెడీ ట్రాక్‌లో పడుతుంది. ఈ సన్నివేశాల్లో వెన్నెల కిశోర్, సత్య కనిపించిన ప్రతిసారీ కామెడీ బాగా పేలింది. క్లైమాక్స్ మాత్రం తేలిపోయినట్టుంది. కొన్ని సన్నివేశాలను మాత్రం దర్శకుడు చక్కగా డీల్ చేశాడు. కామ్రేడ్ కల్యాణ్‌గా శ్రీవిష్ణు ఒదిగిపోయారు. టైమింగ్, సింపుల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆయన బలం. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు చక్కగా నటించారు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది.పాటలు పర్వాలేదు.. వినోదానికి ఏమి ఢోకా లేదు..
