సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) మధ్య దశాబ్దం పైగా కొనసాగుతున్న వివాదం మరోసారి హద్దులు దాటింది. గతంలో త్రివిక్రమ్‌ను ఉద్దేశించి పరోక్షంగా గురూజీ అంటూ సంబోధిస్తూ తన జీవితం నాశనం కావడానికి కుట్ర చేసాడని, ఒక ప్రముఖ హీరోతో తన బంధం చెడగొట్టాడని, బెదిరించాడని, సినిమాలలో హీరో అయినంత మాత్రాన రాజకీయాలలో ప్రజలు హీరో అన్ని నమ్మకూడదని, గతంలో పలు సంచలన వ్యాఖ్యలతో పేమస్ అయ్యిన పూనమ్ కౌర్, కొంతకాలం చల్లబడింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ వేదికగా త్రివిక్రమ్ పేరును కూడా బహిరంగంగా ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ తన కుటుంబ బలహీనతను ఆసరాగా చేసుకుని, వారితో తనపైనే బలవంతంగా స్టేట్మెంట్స్ ఇప్పించాడని ఆమె ఆరోపించింది. తన కుటుంబంతో ఎన్ని స్టేట్మెంట్లు ఇప్పించినా, రాజకీయ నాయకులు చేసిన పనులకు తమ కుటుంబం జవాబు చెప్పాల్సిన అవసరం లేదని పూనమ్ స్పష్టం చేసింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు తప్పుకోవడం, మళ్లీ వారికి సహాయం కావాల్సినప్పుడు తమను వాడుకోవడం త్రివిక్రమ్ చేసిన అత్యంత దుర్మార్గమైన పని అని, ఈ విషయంలో ‘మా’ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు తాను గతంలో పిర్యాదు చేసిన ఇప్పటివరకు ‘త్రివిక్రమ్‌ను ‘మా’ అసోసియేషన్ ఎందుకు ప్రశ్నించడం లేదు? మీరు ‘ఎవరి’ అనుమతి కోసం వేచి చూస్తున్నారు? ఇంకా ఎంతమంది అమాయకుల జీవితాలు నాశనం కావాలని కోరుకుంటున్నారు?‘ అంటూ ఘాటు ప్రశ్నలు వేసింది.
