సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కృషితో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా రూ.1.10 కోట్ల విలువైన 530 సహాయ ఉపకరణాలను 365 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బ్యాటరీతో పనిచేసే మోటరైజ్డ్ వీల్‌చైర్లు, డిజిటల్ వినికిడి యంత్రాలు, సాధారణ వీల్‌చైర్లు, చేతితో నడిపే ట్రైసైకిళ్లు, నడకకు సహాయపడే పరికరాలు తదితర ఉపకరణాలను అందజేశారు. తన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సహాయ ఉపకరణాల పంపిణీ శిబిరాలను నిర్వహించి, మరింత మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని, 2028లో తిరిగి పాలకొల్లులోనూ ఇలాంటి శిబిరాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.
