సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మరి కొద్దీ గంటలలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేస్తుందని భావిస్తున్న తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో నేడు, బుధవారం ఉదయమే కూటమి నేతలు మరోసారి సమావేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ రావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, శివ శంకర్ పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై ఆఖరి చర్చలు జరగనున్నాయి. టీడీపీ పెద్దలు ఊహించని విధంగా 40 శాతం సీట్లు కేటాయించాలని ‘జనసేన’ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.మున్సిపల్ వైస్ చైర్మెన్ లలో కూడా ఇదే శాతం ఉండాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. జనసేన ఆరు కార్పొరేషన్లు, 40 పైగా మున్సిపాలిటీలు పొత్తులో భాగంగా ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 4 కార్పొరేషన్లు, 17 వరకు పురపాలక సంఘాలు ఇచ్చేందుకు టీడీపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. బీజేపీకి తిరుపతి కార్పొరేషన్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం జనసేనాని సమక్షంలో వంగవీటి రాధా పార్టీలో చేరనున్నారు. ఇక భీమవరం మున్సిపాలిటీ సీటు జనసేన నెత రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మెన్ కనకరాజు సూరి తన కుమార్తె వేగేశస్న రామ బంగారు రోహిణి నీ ఖరారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని స్వయంగా ‘సూరి‘ ప్రకటిస్తున్నారు. అయితే టీడీపీ కూడా ఎట్టి పరిస్థితులలో తమ అభ్యర్థి ప్రకటిస్తారని ఎన్నో ఆశలతో ఉంది ఎన్నికల కమిషనర్ ప్రెస్‌మీట్ కూడా నేటి ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *