సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ లోని పున్నమి ఘాట్‌లోనేడు, గురువారం జాతీయ సరస్ మేళా- 2026 ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రారంభించారు. ఆమెతో పాటు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్రపతి సందర్శించారు. మహిళల ప్రతిభ, మేధస్సును‌ ప్రత్యేకంగా అభినందించారు. సరస్ మేళాలలో దాదాపు 650 స్టాల్స్‌లో హస్తకళలు, చేతి వృత్తులు, ఇతర కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొన్నారు. సరస్ మేళా, నేటి నుంచి ఈ నెల 31 వరకు దాదాపు 14 రోజుల పాటు జరగనుంది. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు దేశ, విదేశీ స్థాయిలో గుర్తింపు కల్పించే ఉద్దేశంతో సరస్ మేళాను ఏర్పాటు చేశారు. ‘స్వయం ఏపీ’ బ్రాండ్ పేరుతో డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది… ఇంద్ర క్రిలాద్రి ఫై శ్రీ కనకదుర్గ అమ్మవారిని కూడా రాష్ట్ర పతి ముర్ము దసరావేడుకలలో దర్శించుకొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *