సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) శ్రీమతి N. శ్రీలక్ష్మి నేడు , గురువారం స్ధానిక ప్రత్యేక ఉప కారాగారాన్ని సందర్శించి ముద్దాయిలతో మాట్లాడారు. కారాగారాలు పునరావాస కేంద్రాలని, ముద్దాయిలు పరివర్తన కలిగి కారాగారం నుండి బయటికి వచ్చాక మారిన మనిషిగా బ్రతకాలనీ, మరలా నేరారోపణపై జైలుకు రాకూడదన్నారు. బెయిలు మంజూరైన కేసుల్లో జామీన్లు తెచ్చుకోవలసిన బాధ్యత కూడా ముద్దాయిలదే అన్నారు. ముద్దాయిలకు న్యాయపరమైన సలహాలుగానీ, ఉచిత న్యాయవాదిని నియమించుటకు అర్జీలుగానీ తీసుకుని కోర్టు దృష్టికి తీసుకురావడానికి వారానికి రెండు రోజులు సంస్ధ నియమించిన ఒక న్యాయవాది, ఒక పారా లీగల్ వాలంటీరు వస్తున్నారనీ, వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. న్యాయమూర్తి వంట గదిని పరిశీలించి భోజనాన్ని రుచి చూసారు. ఉచిత న్యాయ కేంద్రంలో రిజిస్టర్లను పరిశీలించి ఉచిత న్యాయవాదులకు, వాలంటీర్లకు సూచనలు చేసారు.ఈ విజిట్ లో న్యాయమూర్తితో పాలు జైలు సూపరింటెండెంట్ D.వెంకటగిరి, ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *