సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం తాడేపల్లి లోని తన నివాసం లో మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ లో అధికార తెలుగు దేశం పార్టీ చేస్తున్న అరాచకాలు ప్రజలు అందరు చూస్తున్నారని, ఇప్పుడు రాష్ట్ర ఈసీ గా విధులు నిర్వహిస్తున్న అనిల్ చంద్ర గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సి ఎస్ గా పనిచేసి విధులు సరిగ్గా నిర్వహించడం లేదని హైకోర్టు ఆగ్రహం తో తొలగించింది. అటువంటి అధికారి రిటైర్ అయ్యాక మరల చంద్రబాబు ప్రోద్బలంతో మరల ఈసీ గా రాష్ట్రానికి వచ్చారు. అందుకే వారికీ అనుకూలంగా మరోసారి వ్యవహరిస్తున్నారు. టీడీపీ గుండాలు అరాచకాలు చేస్తున్న వైసీపీ అభ్యర్థులను నామినేషన్స్ వెయ్యకుండా అడ్డుకొంటున్నవారిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. ప్రజలలో పెరిగిన వ్యతిరేకత తెల్సింది కాబ్బటి చంద్రబాబు కు ఈ ఎన్నికలు సజావుగా జరిగితే .. ఓటమి భయం పట్టుకొంది అందుకే కూటమి అభ్యర్థులు తప్ప ఎవరు నామినేషన్ వెయ్యకుండా ఈ అరాచకాలు కు తెరలేపారు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటనకు, నామినేషన్ల ప్రారంభానికి మధ్య తగిన వ్యవధి ఇవ్వలేదని ఆరోపించారు. టీడీపీ శ్రేణులు తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నాయని, ఆర్‌వోలు నామినేషన్లు స్వీకరించడం లేదని విమర్శించారు. .జాతీయ ఎన్నికల కమిషనర్ కొత్త చట్టం రూపొందించినపుడు తమ వైసీపీ దానికి మద్దతు ప్రకటించి తప్పు చేశామని , 2024 ఎన్నికలలో జరిగిన మోసాలు తరువాత మేము చేసిన తప్పు తెల్సి వచ్చిందని ఇక ఎన్నికల కమిషన్ నిమయ నిబంధనలు మార్చేవలసిందేనని సీజేపీ ( కాక్రోచ్ పార్టీ)డిమాండ్ తో తాను ఏకీభవిస్తున్నానని సంచలాన ప్రకటన చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *