సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్థానిక SRKR ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంతం 6 గంటల వరకు ‘ గోదావరి సాహితి ఉత్సవం’ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సితార, అన్వేషణ, మంచుపల్లకి, ఏప్రిల్ 1 విడుదల, లేడీస్ టైలర్, ఔను వాళ్ళు ఇష్టపడ్డారు, వంటి ఎన్నో అద్భుత చిత్రాలు మ్యూజికల్ హిట్ సినిమాలు అందించిన ప్రముఖ సినీ దర్శకుడు రచయితే, వంశీ కి ఘన సన్మానంతో పాటు అయన రచించిన గోదావరి అలలు పుస్తక ఆవిష్కరణ నిర్వహిస్తారు. ఇక తెలంగాణ కు చెందిన ప్రముఖ వాగ్గేయ కారుడు గోరెటి వెంకన్న వంటి ఎందరో తెలుగు సాహితి ప్రముఖులకు ఘన సన్మానాలు కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *