సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ నేడు, సోమవారం విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 659 మండలాల్లో జెడ్పీటీసీ, 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కలిపి మొత్తం10,488 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీకి రూ.4 లక్షలు, జెడ్పీటీసీకి రూ.8 లక్షల వరకు ఖర్చు చేయొచ్చన్నారు. అక్టోబర్ 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, అక్టోబర్ 24న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, .అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం.. నవంబర్ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నిర్వహిస్తామని, అవసరమైన చోట నవంబర్ 4న తిరిగి పోలింగ్ ఉంటుందన్నారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు అనంతరం అదేరోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు అనిల్ చంద్ర పేర్కొన్నారు.
