సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు వారికీ కూడా సుపరిచితమైన సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు మంచి పామ్ లో ఉన్న బాలివుడ్ యువ సినీ హీరో టైగర్‌ ష్రాఫ్‌పై గత రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ముంబైలోని జుహు సమీపంలో కారులో ఉన్న ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే ఆయన సురక్షితంగా బయట పడ్డారు. అయితే ఈ దాడి తమ పనేనని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కు చెందిన అనిల్ పండిట్ ప్రకటించాడు. సల్మాన్‌ ఖాన్‌తో పని చేయొద్దని చాలాకాలంగా తాము టైగర్ ష్రాఫ్‌కు హెచ్చరిస్తున్నామని, కానీ ఆ యువ నటుడు చెవికెక్కించుకోవడం లేదని అందుకే అతనికి తమ తడాకా చూపేందుకే ఈ శాంపిల్ చర్య అని అనిల్ తెలిపాడు. ఈ నేపథ్యంలో అనిల్‌ పండిట్ నేర చరిత్ర కాస్త పెద్దదే. చాలా కాల్పుల కేసులు అతడిపై ఉన్నాయి. ఒక్క భారత్‌లోనే కాకుండా కెనెడా, థాయ్‌ల్యాండ్, దుబాయ్ దేశాల్లో అనిల్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో స్వల్ప గాయాలపాలైన టైగర్ ష్రాఫ్ ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే నేడు, సోమవారం పరామర్శించారు. ష్రాఫ్ కుటుంబానికి పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తూటాకు తూటానే సమాధానమని నిందితులకు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *