సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ చిన్నవెంకన్న ఆలయంలో ఈనెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల . 21వ తేదీన ఉదయం స్వామి, అమ్మవార్లను పెండ్లికొడుకు, పెండ్లి కుమార్తెగా అలంకరించనున్నారు. 22న ధ్వజారోహణం, 24న ఎదుర్కోలు ఉత్సవం, 25న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, 26న స్వామివారి రథోత్సవం, 28న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పూర్తికానున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయంలో స్వామివారికి జరిగే నిత్యార్జిత సేవలు, కల్యాణాలను రద్దు చేస్తున్నట్లు భక్తులు గమనించాలని ఆలయ అధికారులు తెలిపారు.
