సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. ఒక ప్రక్క ఆకివీడు మునిసిపల్ ఎన్నికలు మరియు ఉండి నియోజకవర్గంలో ఎంపీటీసీ లు , జడ్పీటిసి లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా నేపథ్యంలో వైసీపీ కి చెందిన కీలక నేత ,ఆకివీడు మండలం మాజీ జడ్పీటిసి వేగశిన వెంకటరాజు వైసీపీ పార్టీల్లోని తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ ముదునూరి ప్రసాదరాజు కు ఒక లేఖ ను సమర్పించారు.. తన వ్యక్తి గత కారణాలు చేతనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఏకవ్యాక్యం లో రాజీనామా చెయ్యడం గమనార్హం. వేగశిన వెంకటరాజు కూటమి పార్టీలలో జాయిన్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి మరింత ప్రయోజన కరంగా ఉంటుందని భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద ఉండి నియోజకవర్గంలో అసలే బలహీనంగా ఉన్న వైసీపీ కి ఇది మరో పెద్ద షాకే..
