సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం నుండి వెళ్లి తెలుగు, తమిళ సినిమాలలో ప్రముఖ హీరోగా విలన్ గా ,నటుడు గా పేరొందిన రాజారవీంద్ర తన యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు అతీతంగా, పాపులారిటీ ఉన్న, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు తో చేసిన చేసిన ఇంటర్వ్యూలో జగన్ మోహన్ రెడ్డిపై రఘురామా చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రాజా రవీంద్ర మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిలో మీకు నచ్చే క్వాలిటీ ఏమిటని ప్రశ్నించగా.. దానికి ఆయన రాజకీయ శత్రువైనా జగన్‌లో ఓ మంచి గుణం ఉందని చెప్పారు.. జగన్‌లో తనకు నచ్చే ఒకే ఒక క్వాలిటీ అతని ‘మొండితనం’ అని చెప్పారు. తాను నమ్మింది .. మంచి అయినా, చెడు అయినా ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానికి జగన్ కట్టుబడి ఉండిపోతారని చెప్పారు. అలాగే మహా భారతంలో ధుర్యోదనుడి పాత్రకు జగన్ మోహన్ రెడ్డి 100 శాతం సరిపోతారని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అర్జునుడిగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరెక్ట్ అని చెప్పారు ఇక అసెంబ్లీకి జగన్ రాకపోవడంపై కూడా రఘురామ మాట్లాడుతూ.. . డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్న తనను చూడలేక, ఫేస్ చేయలేకనే జగన్ అసెంబ్లీకి రావడం లేదని పలువురు అంటుంటారని, కానీ తాను మాత్రం ఆ రీజన్ కరెక్ట్ కాదని భావిస్తానని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ చెప్పడంపై కూడా తాను స్వయంగా వెళ్లి ఆయనకు ఒక సలహా ఇచ్చానని , ప్రజల సమస్యలపై చర్చించడానికి ఒక సాధారణ శాసన సభ్యుడిగా అసెంబ్లీకి రావడం మంచిదని, చెప్పానని కానీ ఆయన వినలేదని అన్నారు. (up file photo)
