సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే మనందరి లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యురాలు, టిడిపి భీమవరం నియోజక వర్గ ఇన్ ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్ధసారధి అన్నారు. నేడు, బుధవారం భీమవరం టీడీపీ కార్యాలయంలో టిడిపి జెడ్పీటీసీ, ఏంపీపీ, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. సీతారామలక్ష్మి, రామరాజు మాట్లాడుతూ వీరవాసరం జెడ్పీటీసీ టిడిపి అభ్యర్థిగా తోకలపూడి గ్రామానికి చెందిన చింతపల్లి వెంకట దుర్గ భీమవరం ఎంపీపీ టిడిపి అభ్యర్థిగా కొత్త పూసలమర్రు గ్రామానికి చెందిన బస్వాని లక్ష్మి నరసమ్మలు పోటీ చేస్తున్నారని, భీమవరం మండలంలో 9 మంది ఎంపీటీసీ అభ్యర్థులు గెడ్డం రాంబాబు (శ్రీరామపురం), చాబతుల సువర్ణ (దెయ్యలతిప్ప), తంగెళ్ళ ముత్యాలు (వెంప), పంపన లక్ష్మి ( ఎల్ఎన్ వి పురం), పిల్లి సుజాత (పెదగరువు), నాగిడి నాగన్న (నాగిడిపాలెం), బస్వాని లక్ష్మి నరసమ్మ ( కొత్తపూసలమర్రు), లోలోగు మురళీ (దిరుసుమర్రు), దొంగపిండి ఎంపీటీసీ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని, వీరవాసరం మండలంలో 8 ఎంపీటీసీ స్థానాలలో యరకరాజు గోపాల కృష్ణంరాజు (కొణితివాడ -1), మల్ల లావణ్య (కొణితివాడ -2), పాల శ్రీనివాసరావు (ఉత్తర పాలెం), తెలి ప్రకాశరావు (అండలూరు), బండి నాగలక్ష్మి (రాయకుదురు -2), యిర్రింకి అన్నపూర్ణ ( చింతలకోటి గరువు), మల్ల శ్రీరామ మూర్తి (పంజా వేమవరం), రాయపల్లి వెంకటేశ్వరరావు (వీరవాసరం -3) లు ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీకి ఎంపిక చేసామన్నారు.
