సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరగనీయకుండా వైసీపీ పార్టీ అడ్డుకుంటోందన్నారు టీడీపీనేత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి. తాజాగా మీడియా సమావేశంలో అన్నారు. తమపై తరుచు తప్పుడు ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ లలో దాడులు జరిగాయని పరిస్థితి దారులంగా ఉందని కోర్ట్ లకు పదేపదే వెళుతూ.. ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకొంటున్నారని, ఇదే జరిగితే రాష్ట్రంలో, స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే 16వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,500 కోట్లు శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. నిజానికి వైఎస్సార్‌సీపీ నిత్యం అరాచకాలు, దాడులు, రక్తపాతానికి తెగబడుతోందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి రౌడీలను కూడా తీసుకొచ్చారని పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
