సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ లో 500 కోట్ల కలెక్షన్ సాధించిన నేపథ్యంలో ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి మెగా- అల్లు అభిమానుల మధ్య సరికొత్త దుమారానికి తెరలేపింది.. “చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు కొట్టడం ఒక్క రజినీకాంత్ గారికే సాధ్యం” అది 70 పదులు దాటినా హీరోలలో.. రజని సత్తా అంటూ బన్నీ ప్రశంసలు కురిపించడమే ఈ వివాదానికి కారణమైంది.గతంలో కూడా అల్లు అర్జున్ ముంబై ఎయిర్ పోర్ట్ లో బ్రహ్మానందం బొమ్మ ఉన్న టీ షార్ట్ వేసుకొని ‘ది బాస్.. నెల్లూరు పెద్దారెడ్డి’ అన్న కాప్షన్ తో.. తాను మాట్లాడకుండానే ఎంత వైరల్ అయ్యారో అందరికి తెలిసిందే.. ఇప్పటికే చిరంజీవి, రజినీకాంత్ బాక్సాఫీస్ మార్కెట్‌పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, ఇది మెగాస్టార్‌ను పరోక్షంగా ఉద్దేశించి చేసిన వ్యాఖ్యేనంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతుండగా, అల్లు అర్జున్ అభిమానులు సైతం ధీటుగా బదులిస్తుండటంతో మొన్న పుష్ప 2 సమయంలో తారాస్థాయికి చేరిన వారి ఇరు కుటుంబాల అభిమానుల వార్ ఇటీవల కాస్త నెమ్మదించింది అనుకుంటే మరల తారాస్థాయికి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *