సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం చంద్రబాబు నేడు, శనివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ ఫై మండిపడ్డారు. వారి కుటుంబ వ్యహారాలపై కూడా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ.. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో జగన్ లాంటి వ్యక్తి ని చూడలేదని , ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్స్ సమయంలో దాడులు జరిగాయని అనేక అబద్ధపు ప్రచారాలు, ఫేక్ వీడియోలు విడుదల చేసి వాటిని ఆధారాలుగా చూపి కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో ఏంతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుంటే .. ఎదో అరాచకం జరిగిపోతుందని జగన్ చేస్తున్న ప్రచారం వల్ల దేశవ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్రము బ్రాండ్ పడిపోతుందని విమర్శించారు. ‘నోరు ఉంది.. వేసుకోవడానికి పేపర్ ఉంది.. అందుకని వాగితే సరిపోతుంది. నువ్వే తప్పు లు చేసి దాడులు చేసి, 500 సార్లు వాయిదాలు ఎందుకు అడిగావు. మీ తండ్రి ఇచ్చిన ఆస్తిని నీ చెల్లెలికి ఎందుకు ఇవ్వవు? చివరికి ఆస్తి కోసం తల్లిని కోర్టుకు ఈడ్చావు.. అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని.. ఇప్పుడు ఒక పార్టీ నేతగా కూడా అరాచకాలు చేస్తూ ప్రతిపక్ష నేతగా ఫెయిల్ అయ్యారంటూ సీఎం చంద్రబాబు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *