సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నిన్న సాయంత్రం నామినేషన్ గడువు పూర్తీ అయ్యేసరికి కొన్ని చోట్ల ఎన్నో వివాదాలు గలాటాలు మధ్య వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. నేడు, శనివారం ఉదయం అందిన తాజా సమాచారం ప్రకారం...మొత్తం 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలవగా.. 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున 3,315 జెడ్పీటీసీ స్థానాలకు, 25,016 ఎంపీటీసీ స్థానాలకు పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు మొత్తం 22,013 నామినేషన్లు వేశారు. అలాగే వైసీపీ అభ్యర్థులు 20,556 నామినేషన్లను దాఖలు చేశారు. జనసేన పార్టీ తరఫున 4,609 మంది నామినేషన్లు, బీజేపీ నుంచి 1,150 నామినేషన్లు వేశారు. అయితే పలు చోట్ల తమ అభ్యర్థుల నామినేషన్స్ అడ్డుకొని పోలీసులు అధికారుల సమక్షంలోనే దాడులు చేసి చింపివేశారని వైసీపీ హైకోర్టు కు వెళ్ళింది. కొన్ని ప్రాంతాలలో జనసేన అభ్యర్థుల నామినేషన్స్ కూడా టీడీపీ వారు అడ్డుకొని చింపివేశారని పిర్యాదులు రావడం గమనార్హం..దీనిపై ఎన్నికలు అనుకున్న షెడ్యూలు ప్రకారం జారుతుందో లేక సుప్రీం కోర్ట్ ఆదేశాలతో మునిసిపల్ ఎన్నికల షెడ్యూలు మారినట్లు వాయిదా పడుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *