సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక ఫుట్ పాత్ వంతెన వద్ద నేటి శనివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి గొల్లవానితిప్ప రహదారి వైపు వెళుతున్న లారీ బ్రిడ్జి సమీపం వద్దకు వచ్చేసరికి బ్రేక్ లు ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా వెనకకు జారింది అని స్థానికులు వాహనదారులు పేరుకొన్నారు. బ్రేక్ లు ఫెయిల్ అయిన లారీ వెనకవైపు వస్తున్నా నాలుగు వాహనదారుల పైకి జారీ వెళ్ళింది. ఊహించని విధంగా లారీ వెనక్కి రావడం తో నాలుగు ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తున్న వారు వాహనాలు వదిలేసి ప్రక్కకు త్రిప్పుకొన్నారు. అయితే ఒక మహిళకు గాయాలైనట్లు సమాచారం. ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు భావిస్తున్నారు. అయితే . ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు ధ్వంసం కాగా.. కంగారులో డ్రైవర్ పరారీ అయ్యాడని సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
