సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం పట్టణ పరిధిలో గతంలో 39 వార్డులు ఉన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే త్వరలో 2వ విడతలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా ఈసీ ఆదేశాల మేరకు పెరిగిన జనాభా ను ద్రుష్టి లో పెట్టుకొని నూతనంగా పునర్విభజించిన 52 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను నేడు, శనివారం మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఎన్నికల అధికారులు ప్రచురించారు. ఈ జాబితాలను మున్సిపల్ కార్యాలయంతో పాటు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల నోటీసు బోర్డులపై అందుబాటులో ఉంచారు. అలాగే, ఓటర్ల జాబితాల ప్రతులను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. దీనితో స్థానిక పట్టణ ఓటర్లు తమ ఓట్లు ఏ వార్డులో ఉన్నాయో సరిచేసుకొని ఒక వేళా లేకపోతె స్థానిక వ్రాత పూర్వకంగా పిర్యదు చేసుకొనే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *