సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆర్నబ్ తుపాను ముప్పు నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని విద్య సంస్థలకు నేడు, రేపు బుధవారం సెలవులు ప్రకటించినట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగలక్ష్మి స్పష్టం చేశారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. గంటకు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అన్నారు. నరసాపురం, భీమవరం సముద్ర తీర ప్రాంతాల్లోని 14 మత్స్యకార గ్రామాల్లో తుపాను షెల్టర్లు సిద్ధం చేశామని చెప్పారు. ఆర్నబ్ తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం భీమవరంలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 08816299181 అని ప్రకటించారు. పేరుపాలెం బీచ్‌ను తాత్కాలికంగా మూసివేసినట్లు నర్సాపురం – సఖినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో ఫంట్, పడవలపై రాకపోకలు నిలుపివేసినట్లు ప్రకటించారు.
