సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘంలో ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఓటర్లు లిస్ట్ ప్రకారం.. 5 విలీన గ్రామాలతో కలిపి మొత్తం పట్టణ ఓటర్ల సంఖ్య 1,45,737కు చేరింది. ఇందులో పురుషులు75,841, స్త్రీలు 69,848 మంది పురుషులు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 5,993 మంది అధికంగా ఉన్నారు. కొత్తగా గ్రామాల విలీనంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 119 నుంచి 157కు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా . 3.1199/SEC-F2/2026-1, 38.22-10-2026 5 2 2.2. 2 2 సర్క్యులర్ ఉత్తర్వులు ప్రకారం భీమవరం పురపాలక సంఘము నకు సంబందించి విలీన గ్రామములు అయిన 1) రాయలం, 2) చిన-అమిరం, 3) కొవ్వాడ – అన్నవరం మరియు 4) తాడేరు లతో కలిపి 52 వార్డులకు గాను 157 పోలింగ్ స్టేషన్ లను గుర్తించి, ది.26-10-2026 వ తేదీన Annexure-1 నందు ప్రచురణ చేయుట జరిగినది. దీనిలో ఓటర్లు కు సదరు పోలింగ్ స్టేషన్ లకు సంబందించి పట్టణ ప్రజల వద్ద నుండి ఏమైనా అభ్యంతరములు, సూచనలు ఉన్న ఎడల రేపటి లోగ అంటే.. ది.27-10-2026 వ తేదీ లోగా మున్సిపల్ ఆఫీసు నందు తెలియజేయవలసినదిగా మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి కోరుతున్నారు.
