సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జిల్లా పరిషత్తు ఎన్నికలలో నామినేషన్స్ ఉపసంహరణ గడువు ముగుస్తుండటంతో .. జనసేన అధినేత డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాము జనసేన పార్టీ తరపున బి పారమ్స్ ఇవ్వని అభ్యర్థులు వెంటనే తమ నామినేషన్స్ ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. కూటమి మధ్య అభ్యర్థులకు సీట్ల పంపిణి చక్కగా చాల సునాయాసంగా జరిగిందని కితాబు ఇచ్చారు. ఎక్కువ మంది కూటమి అభ్యర్థులు పోటీ పడుతున్న వేళా ఇబ్బందులు తప్పవని, అయితే నేను, చంద్రబాబు, మాధవ్ ల మధ్య అగ్ర నాయకత్వం మధ్య ఎలా సయోధ్య ఉందొ, జనసేన నేతలు కూడా అదే విధంగా కూటమిని అభ్యర్థుల గెలుపు కు పనిచేయాలని ఆదేశించారు. జగన్ తన హద్దులలో ఉండాలని బెదిరించడం మానుకోవాలని ‘మీరు 2.O చూపిస్తే మేం 10 X చూపిస్తాం. మీరు ఇలా మాట్లాడితేనే 2019లో ప్రజలు గుణపాఠం చెప్పారు’ అంటూ వ్యాఖ్యానించారు. జగన్ బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. సీఎం చంద్రబాబు చెప్పినట్టు జగన్ జనజీవన స్రవంతికి రావాలని పిలుపునిచ్చారు. క్యాడర్ కు క్లిష్టతరమైనా సరే… రాష్ట్రాభివృద్ధి కోసం కూటమిగానే ఉంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *