సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి అధ్యక్షతన జనరల్ ఎలక్షన్స్–2026 నిర్వహణకు సంబంధించి సన్నద్ధతా సమావేశం నేడు, మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు, అధికారుల బాధ్యతలు, సిబ్బంది సమన్వయం తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల విధులకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ ఏ. రాంబాబు, మున్సిపల్ ఇంజనీర్ తాతయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, వివిధ మున్సిపల్ విభాగాల సెక్షన్ హెడ్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
