సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆర్నబ్ తుఫాను ప్రభావంతో ఏర్పడిన పారిశుధ్య పరిస్థితుల నేపథ్యంలో భీమవరం డీఎన్ఆర్ (A), కళాశాల ప్రాంగణంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వారే రంగంలోకి దిగి తుఫాను ప్రభావం కారణంగా కళాశాల ప్రాంగణంలో పేరుకుపోయిన ఆకులు, చెత్తాచెదారం, విరిగిపడిన కొమ్మలు మరియు ఇతర వ్యర్థాలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో వాలంటీర్లు తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు. అందరికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), వైస్ ప్రెసిడెంట్ శ్రీ గోకరాజు పాండురంగారాజు, కళాశాల పరిపాలనాధికారి పి. రామకృష్ణం రాజు ప్రిన్సిపాల్స్ డా.B నరసింహరాజు ,డా.B V S వర్మ విద్యార్థుల సేవాభావాన్ని అభినందించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు మరియు వాలంటీర్లను వారు ప్రత్యేకంగా ప్రశంసించారు.
