సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆర్నబ్ తుపాన్ విలయంతో గోదావరి జిల్లాలో ఇప్పటికి 5 రోజులుగా విద్యుత్తూ సరఫరా పూర్తీ స్థాయిలో పునరుద్దరించలేదు. మరో ప్రక్క ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంది.తుపాన్ తీరం దాటటంతో తీవ్రంగా నష్టపోయిన అంతర్వేది నుండి భీమవరం వరకు వారి కీలక పర్యటన ఉంటుంది. ఈరోజు(శనివారం) ఉదయం రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న కేంద్ర బృందం తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఇతర అధికారులు జరిగిన నష్టాలను వివరించారు. కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈవో ప్రఖర్ జైన్ నష్టాన్ని వివరించారు.,ప్రాథ‌మిక అంచ‌నాల ప్రకారం ఆర్నబ్ వల్ల రాష్ట్రానికి రూ.4764 కోట్ల మేర న‌ష్టం వాటిల్లిందని.. దాదాపు 12 జిల్లాల్లో న‌ష్టం వాటిల్లిందని తెలిపారు ఈ కేంద్ర బృందంలో వ్యవసాయ, ఆర్థిక, విద్యుత్, జలవనరులు, ఇస్రో, గ్రామీణాభివృద్ధి, రోడ్లు-రవాణా శాఖల అధికారులు ఉన్నారు.తదుపరి . కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నేటి శనివారం మధ్యాహ్నం నుండి గోదావరి జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *