సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశవ్యాప్తంగా శతాబ్దం పైగా చెలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ ఇకపై రూపం మార్చుకోబోతుంది. కొత్తగా పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ఆర్బీఐ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో భాగంగా పైలట్ ప్రాజెక్ట్ కింద పాలిమర్ కరెన్సీ నోట్లను 2027, ఏప్రిల్ 1 నాటికి ప్రయోగాత్మకంగా విడుదల చేస్తారని తాజా సమాచారం. దీనిలో భాగంగా దేశం లో అధికంగా చెలామణిలో ఉండే రూ. 10, రూ. 20 విలువైన నోట్లు ముందుగా రాబోతున్నాయి. టీ కొట్టు దగ్గర బయట షాపింగ్ చేసినా రూ. 10 నుంచి వేలల్లో బిల్లు వరకు చాలా వరకు ఫోన్‌పే లేదా గూగుల్ పే ఇలా యూపీఐ ద్వారానే చెల్లిస్తుంటారు. అలా అని నగదుకు డిమాండ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఇక మన రోజువారీ లావాదేవీల్లో ఎక్కువగా రూ. 10, రూ. 20 నోట్లు ఎక్కువగా వినియోగిస్తుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోద ముద్ర కూడా వేసింది. అయితే ఇక్కడ కొత్త ప్రశ్న ఏమిటంటే.. రూ. 10, రూ. 20 ప్లాస్టిక్ నోట్లు వస్తే పాత నోట్లను పూర్తిగా తొలగిస్తారా? . అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పాలిమర్ నోట్ల కొలతలను ప్రస్తుతం ఉన్న రూ. 10, రూ. 20 నోట్ల మాదిరిగానే ఉంచే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *