సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం సమీపంలోని కాళ్ళ మండలం, కాళ్ళకూరు గ్రామంలో నిర్మించిన “శ్రీ సీతారామ ఆలయం” నూతన ప్రారంభోత్సవ వేడుకల్లో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేషంగా హాజరు అయిన భక్తుల సమక్షంలో చలువ పందిళ్ళలో ..వేద పండితులు నిర్వహించిన పవిత్ర యాగంలో పాల్గొన్నారు. శ్రీ సీతా రాముల వారి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని రఘురామా అభిలషించారు. . ఈ కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
