సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని అరాచకాలు,దహనాలు అధికారుల ముందే నామినేషన్స్ గుంజుడు , కొట్లాటలు చూసి దేశం నివ్వెరపోయింది. ఎన్నో వివాదాలు ఆరోపణలు ఇంకా కొనసాగుతున్న వేళా.( సుప్రీం కోర్ట్ వాటిపై ఇంకా విచారణ కొనసాగుతుంది.)… ఎట్టకేలకు రేపు (ఆదివారం) జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నేడు, శనివారం సాయంత్రం మీడియా తో మాట్లాడుతూ.. ఏపీలో తొలిదశలో 100 పట్టణ స్థానిక సంస్థలకు (13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంస్థలు/నగర పంచాయతీలు) ఎన్నికలు జరుగనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపల్ ఛైర్మన్ పదవులు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద వీడియో ఫుటేజ్ భద్ర పరుస్తామని, పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం, ఆకివీడు మినహా, భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లి గూడెంలో ఈ విడుత ఎన్నికలు నిర్వహించక పోవడం గమనార్హం.
