సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ నేడు, ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను భీమవరం లో ఘనంగా నిర్వహించారు. భీమవరం, ఆదివారం బజార్, శ్రీ పొట్టి శ్రీరాములు గారి సెంటర్ లో కాంస్య విగ్రహానికి మరియు స్థానిక పొట్టిశ్రీరాములు గర్ల్స్ హైస్కూల్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. ఆర్యవైశ్యులు ఆధ్వర్యంలో పలు చోట్ల వేడుకలు నిర్వహించారు. భీమవరంతో స్వర్గీయ పొట్టి శ్రీరాములు కు ఉన్న మంచి అనుబంధం చాల మందికి తెలియదు. తెలుగు ప్రజలకు ప్రత్యక రాష్ట్రము కావాలని పొట్టి శ్రీరాములు మొదట నిరాహార దీక్ష చేసింది భీమవరం త్యాగరాజ భవనంలోనే… అన్న విషయం చాల మందికి తెలియదు. భీమవరంలో 10 రోజులు పైగా రోజులు నిరాహార దీక్ష చేసి .. సరైన ప్రచారం రాకపోవడంతో కొంత విరామం తీసుకోని అప్పటి మద్రాస్ రాజధానిలోనే అయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. 50 రోజులు పైగా దీక్ష కొనసాగించి చనిపోయి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రము సాధించారు.
