సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్ :భీమవరం టౌన్ హాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల సమన్వయ సభ నిర్వహించారు. జెడ్పీటీసీలు ఎంపిటీసీలు ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థులు వన్‌ సైడ్ విజయం కావాలని, గెలుపే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసి కట్టుగా పని చేయాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు, యంపిటీసీలు ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే వన్‌ సైడ్ విజయం కావాలని, అందుకు అనుగుణంగా ప్రచారాన్ని మరింత వేగవంతం పెంచాలన్నారు. వైసీపీ పార్టీకి ఒక్కఓటు వేసిన నష్టమే జరుగుతుందని, ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారాలు జరగాలన్నారు. రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ..ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించుకోవడామే మనందరి లక్ష్యమని, అన్ని చోట్ల విజయం సాధించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ కలయికతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించుటకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *