సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లో నేడు, సోమవారం జరిగిన ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ పేరిట బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొని బీజేపీ పార్టీ శ్రేణులలో జోష్ నింపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దించేసి కాషాయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే తనతోపాటే నినాదాలు చేయాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేద్దామని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ఇక్కడి అరాచకశక్తులను తుదముట్టిద్దామని చెప్పారు. త్వరలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆ దిశగా అడుగులు పడుతున్నాయని అమిత్ షా పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజెయ్ తో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *