సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: జోరు వానలో నేడు మంగళవారం భీమవరం మండలంలో స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ ఇంచార్జి తోట సీతారామ లక్మి కూటమి పార్టీ శ్రేణులు, జెడ్పీటీసీ, ఎంపిటీసీ అభ్యర్థులతో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భీమవరం మండలం కొమరాడ సెంటర్ నుంచి అనాకోడేరు, తుమ్మగుప్ప, గొల్లవానితిప్ప, గూట్లపాడు, కొత్త పూసలమర్రు, లోసరి, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, రామాయణపురం, యనమదుర్రు, దిరుసుమర్రు 1, దిరుసుమర్రు 2, వెంప, శ్రీరాంపురం, పెదగరువు, తుందుర్రు, బేతపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు, తోట సీతారామ లక్ష్మి ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ.. మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రెండున్నర ఏళ్లలో ప్రతి మండలంలో కోట్లాది రూపాయలు అభివృద్ది పనులు చేపట్టామని, గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 20 శాతం పనులు కూడా చేపట్టలేక పోయారన్నారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం చాలా అవసరమని పిలుపు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *