సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా లో మధ్యంతర ఎన్నికలలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ,, ఎన్నికలు కాగానే తాను మరల ఇరాన్‌పై దాడిచేసే ఆలోచన ఉన్నట్లు వస్తున్నా వార్తలు ఖండించారు. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితి అమెరికాకు అనుకూలంగా ఉందన్నారు. తాము కోరుకున్నది ప్రతిఒక్కటీ లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఈవారంలో ఇరాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవసరమైతే అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని, అయితే దాడి చేయాల్సిన అవసరం రాకపోవచ్చని ట్రంప్ తెలిపారు.ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకొంది అయితే, ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే ఇరాన్‌తో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయి యుద్ధంగా తాను పరిగణించడం లేదని, తాము అనుకుంటే పది నిమిషాల్లో ఆ పనిని ముగించి వేయగలమని ఆయన ఆర్భాటంగా వ్యాఖ్యానించారు.(చింత చచ్చిన పులుపు చావలేదని సామెత చందాన..) కాగా.. ఇటీవల హోర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంపై అమెరికా వైమానిక దాడులు చేసింది. అమెరికా సైనిక ఆస్తుల రక్షణ కోసమే ఈ చర్య తీసుకున్నట్లు వాషింగ్టన్ ప్రకటించింది.
