సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కూరగాయల ధరలతో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశం వైపు సాగిపోతూ మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్న తరుణంలో.. మహారాష్ట్ర నుంచి 800 టన్నుల ఉల్లిపాయలు ఏపీకి వచ్చాయి. నేటి శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతుబజార్లలో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నట్లు పౌర సరఫరాలశాఖ కమిషనర్ కన్నబాబు ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కేజీ 70 రూపాయలు మించి పెరగటంతో ప్రజలకు తక్కువ ధరకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడంతో పాటు 1 కిలో రూ.35కే రైతుబజార్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. .మరోవైపు 26 కేజీల సన్నబియ్యం 2300 రూ వరకు పెరగటంతో ప్రజలకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం రాయితీపైనాణ్యమైన ధరణి బ్రాండ్ పేరుతో నాణ్యమైన సన్నబియ్యం 26 కేజీల బస్తా కేవలం రూ. 1,300 కే ప్రభుత్వం అందిస్తోంది. అలాగే బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ. 49 నుండి రూ. 52 వరకు.. కేఎన్ఎం / నెల్లూరు సన్నాలు బియ్యం కిలో రూ. 50కి అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ప్రజలు తమ ఆధార్ కార్డ్ చూపించి ఈ కౌంటర్ల ద్వారా సబ్సిడీ బియ్యాన్ని పొందవచ్చు
