సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లోను ఇరాన్, అమెరికా మధ్య అటు రష్యా ఉక్రెయిన్ ల మధ్య ఉద్రిక్తలు తగ్గటంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో నేడు (బుధవారం) భారత్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు గత 8 నెలల గరిష్ఠ స్థాయిల వద్ద ప్రారంభమై, విదేశీ ఇన్వెస్టర్ల (FII/FPI) భారీ కొనుగోళ్లు, జరిగి రికార్డు లాభాలతో ముగిశాయి. నవంబర్ నెలలో ఇప్పటివరకు చూస్తే క్రూడ్ ఆయిల్ పతనం, విదేశీ నిధుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఏకంగా 10% వరకు లాభపడటం విశేషం.బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex): 772.75 పాయింట్లు (0.95%) లాభపడి 81,879.40 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (Nifty 50): 210.40 పాయింట్లు (0.84%) పెరిగి 25,255.05 మార్కు వద్ద ముగిసింది. ఫార్మా రంగాన్ని మినహాయిస్తే నిఫ్టీలోని దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లకు మంచి జోష్ వచ్చింది. , బ్రాడర్ మార్కెట్లో నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీ 1.73శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1.11శాతం మేర ర్యాలీ చేశాయి.
