సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇకపై ఇరాన్ ఫై యుధం చేసే ఉద్దేశ్యం లేదని ప్రకటించినప్పటికీ అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. తమతో చర్చలు జరపాలన్నా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్నా అమెరికా ఏడు షరతులను అంగీకరించాలని ఇరాన్ డిమాండ్ చేస్తుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ప్రధాన చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ‘అల్ జజీరా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధం కావాలో వద్దో నిర్ణయం తీసుకోవాల్సింది అమెరికానేనని, తమ ప్రతిపాదనలపై ఆ దేశం స్పందించి ప్రకటించాలని అన్నారు. అయితే మరోసారి సైనిక చర్యలకు దిగితే అమెరికాకు మరో ఓటమి తప్పదని హెచ్చరించారు ఆ డిమాండ్స్ లో ముఖ్యమైనవి 1, ఇరాన్‌పై అమెరికా విధించిన ఏకపక్ష ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి. 2) ఇరాన్ చమురు ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించాలి. 3) ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన నౌకాదళ ఆంక్షలు, దిగ్బంధాన్ని తొలగించాలి. 4) విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులు, నిధులను విడుదల చేయాలి.
