సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజకీయాలు చక్రం తిప్పే ప్రాంతంగా పేరున్న భీమవరంలో ఈనెల 26వ తేదీన మునిసిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. నేడు, గురువారం మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడంతో.. భీమవరంలో మునిసిపల్ చైర్ పర్సన్ గా పోటీ చేసే మహిళా అభ్యర్థులు అలాగే 50 వార్డులలో పోటీ చేసే ఆశావహులు వివిధ పార్టీల నేతలను ప్రజలను కలుస్తూ ఇప్పటి నుంచే పరోక్షంగా ప్రచారం ప్రారంభించారు. ఈసారి ఎక్కువ స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం కనపడుతుంది. ఇదిలా ఉండగా కూటమి పార్టీలలో టికెట్స్ ఆశిస్తూ కొత్తగా పార్టీలలోకి చేరుతున్న ఆశావహుల సందడి కూడా ఎక్కువే.. ఇప్పటికే మునిసిపల్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి కూటమి అబ్యర్థిగా పోటీ చెయ్యాలని ప్రధానంగా 5 గురు మహిళలు ముందుకు రావడం, మరికొంత మంది ఆర్ధిక బలం ఉన్నవారు లోపాయకారిగా ‘ఫై స్థాయిలో’ తమ ప్రయత్నాలు చేస్తుండంతో కూటమి ప్రధాన నేతలకు ప్రజా ప్రతినిధులకు కూడా ఒత్తిడి పెరిగింది. ఇదిలా ఉండగా నేడు, గురువారం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు ని ఆయన కార్యాలయంలో గురువారం ఉదయం కలిసిన భీమవరం పురపాలక సంఘ ‘చైర్ పర్సన్’ అభ్యర్థుల రేస్ లో ఉన్న డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, మెంటే భ్రమరాంబ దేవి, పత్తి విమల కృష్ణ. తది తరులు కలసి ఈసారి తమకు అవకాశం కల్పించాలని విజ్ఞాపన పత్రాలు అందించడం జరిగింది.
