సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘం తాజగా నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది. ఈనెల 26వ టీడిన మొత్తం 23 స్థానిక సంస్థలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూలు కూడా విడుదల చేసింది. మునిసిపాలిటీలలో ఈనెల 15వ తేదీ నుండి 17వ తేదీవరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఉంటుంది. 21వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. 26వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫలితాలు 30న వెలువడతాయి. ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికలు షెడ్యూలు ప్రకారం..15వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ నుండి మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ఎన్నికల షెడ్యూలు ఉంది. అయితే ఎన్నికలు పోలింగ్ జరిగిన రోజునే ఫలితాలు వెలువడతాయి. అవసరమైతే 27వ తేదీన రి పోలింగ్ ఉంటుంది. రెండవ విడత పంచాయతీ ఎన్నికలు కు ..నవంబర్ 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.ఇక 3వ వ విడత పంచాయతీ ఎన్నికలు.కు నవంబర్ 19వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
