సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాల వైపు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన హైదరాబాద్, బెంగళూర్ తదితర ప్రయాణికుల కు రైళ్ల టికెట్ రిజర్వేషన్ ఇబ్బందులు మొదలయ్యాయి. 60 రోజుల ముందే రైల్వే రిజర్వేషన్‌ ప్రారంభం అవుతున్నప్పటికీ.. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆన్‌ లైన్‌లో బుకింగ్‌ ఓపెన్‌ అయిన వెంటనే బెర్త్‌లన్నీ ఫుల్‌ అయిపోతున్నాయి. ఇంత పాస్ట్ గా టికెట్స్ ఎలా బుక్ చేస్తున్నారో? ఎవరికీ అర్ధం కావడంలేదు. జన వరి 8 నుంచి 13 వరకు ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి గోదా వరి జిల్లాల మీదుగా నడిచే ప్రధాన రైళ్లన్నీ వెయిటింగ్‌ లిస్ట్‌ లేదా రిగ్రెట్‌ (నో బెర్త్‌) చూపిస్తుండటంతో ప్రయాణికుల్లో ఊహించని ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌ నుంచి గోదావరి జిల్లాల మీదుగా నడిచే లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌లో, చర్లపల్లి మీదుగా వచ్చే నాగర్‌సోల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైలులో, భీమవరం, తణుకు మీదుగా నడిచే ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో, హైదరాబాద్‌ నుంచి భీమవరం మీదుగా భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు జనవరి 8, 9 ,10, 11, 12 13 తేదీల్లో స్లీపర్‌, ఏసీ తరగతుల్లో బెర్త్‌లు ఖాళీ లేవు.అల్ హౌస్ పుల్ ఇక స్పెషల్ ట్రయిన్స్ లేదా తత్కాల్‌, రైళ్ల కోసం అదృష్టం పరీక్షించుకోవాలని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *