సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రిజర్వ్‌ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న వార్తలు నేపథ్యంలో దేశంలో మూడు రోజుల పాటు సాగిన స్టాక్‌ మార్కెట్ల జోరుకు బ్రేక్‌ పడింది. నేడు, శుక్రవారం సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ ఉదయాన్నే నష్టాలతో మొదలై, రోజంతా కొనసాగింది. సెన్సెక్స్ చివరికి 318.56 పాయింట్ల నష్టంతో 81,592.45 వద్ద ముగిసింది. ఒక దశలో మరింత పడిపోయిన సెన్సెక్స్‌, చివరికి ట్రేడింగ్ ముగిసే సమయానికి స్వల్పంగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 155.05 పాయింట్ల నష్టంతో 25,144.30 వద్ద ముగించింది. ఇటీవల మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి కనిపించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 94.24గా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *