సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్లు ఏపీలో అల్లకల్లోలం సృష్టించగా.. ఇప్పుడు మరో తుఫాన్ గండం ఏర్పడింది.ఈ తుఫాన్‌కు అక్వాన్ అనే నామకరణం చేశారు. ఇరాన్ ఈ పేరును సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 16న తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ముందుగా దీని ప్రభావం ఏపీ ఫై తక్కువ ఉంటుంది అని భావించినప్పటికీ తాజా రిపోర్ట్ ప్రకారం ఇది మచిలీపట్నం, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం వాయుగుండముగా బలపడే అవకాశం ఉంది.చలిగాలుల తీవ్రత గోదావరి జిల్లాలో పెరుగుతుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, లోని గోదావరి జిల్లాలలో యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఎల్లుండి సోమవారం నుండి రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *