సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తికమాసం ప్రభావం గోదావరి జిల్లాలలో చికెన్‌ ధరలపై పడింది. కార్తికమాసం ప్రారంభమైన తర్వాత తొలి ఆదివారమైన నేడు (నవంబర్‌ 15) గత వారంతో పోలిస్తే 1కిలో చికెన్‌పై రూ.60 నుంచి రూ.80 వరకు ధర తగ్గింది. పవిత్రంగా భావించే కార్తికమాసంలో చాలామంది భక్తులు అయ్యప్ప స్వాములు శివ స్వాములు దీక్ష చేపడతారు., శివాలయాల్లో ప్రత్యేక పూజలు, కార్తిక వ్రతాలు నిర్వహిస్తూ, భజనలు చేస్తూ మాంసాహారానికి దూరంగా శాఖాహారం మాత్రమే తీసుకొంటారు.దీంతో చికెన్‌కు డిమాండ్‌ గణనీయంగా పడిపోయింది. అమ్మకాలు తగ్గడంతో పౌల్ట్రీ వ్యాపారులు ధరలను తగ్గించాల్సి వచ్చింది. ఫలితంగా గత వారం వరకు రూ.300కు పైగా పలికిన స్కిన్‌లెస్‌ చికెన్‌ ధరలు ఇప్పుడు పలు ప్రాంతాల్లో రూ.250 లోపే దొరుకుతున్నాయి. అలాగే గుడ్ల ధరలు దిగివస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *