సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపల్ ఎన్నికల్లో బరిలో కూటమి అభ్యర్థులదే విజయమని నేటి ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం మున్సిపల్ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్యే అంజిబాబు ప్రకటించారు. భీమవరం మున్సిపల్ చైర్మన్ జనసేన అభ్యర్థిగా, డా చుండూరి మల్లీశ్వరి ఎంపిక చెయ్యడం జరిగిందని, విజయానికి కూటమి లో అందరూ సమిష్టిగా పని చేద్దామని భీమవరంలో52 కౌన్సెలర్స్ స్థానాలకు 23 జనసేన, 24 టిడిపి, 5 బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, వారి విజయానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు. జనసేన కౌన్సిలర్ అభ్యర్థులు వివరాలు: 2వ వార్డు తోట లీలా మాధవి, 12వ వార్డు తుటారపు పద్మావతి, 13వ వార్డు పెంటపాటి శివరామ రెడ్డి14వ వార్డు వడ్డీ మంజు భార్గవి, 20వ వార్డు యర్రంశెట్టి గౌతమి, 25వ వార్డు సుంకర రవీంద్రనాథ్ ఠాగూర్, 26వ వార్డు జులూరి వెంకటేష్, 29వ వార్డు మగాపు సత్య వాణి30వ వార్డు యర్రా నాగ వరలక్ష్మి, 31వ వార్డు పడమట లక్ష్మీ పద్మజా, 32వ వార్డు కఠారి వరలక్ష్మీ, 33వ వార్డు వానపల్లి సూర్య ప్రకాష్ రావు, 35వ వార్డు వీరమల్లు పార్వతి,36వ వార్డు డా కంతేటి హర్షిత,38వ వార్డు దారాబత్తుల శ్రీనివాస్,40వ వార్డు వీరిన తనూజ లక్ష్మీ, 47వ వార్డు దూది చంద్రకళ, 49వ వార్డు దాసరి సురేష్, 50వ వార్డు మద్దింశెట్టి దివ్య కమలాశ్రీ, 51వ వార్డు తోట బాల సుబ్రమణ్యం లు పోటీ చేస్తున్నారని తెలిపారు.
