సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి గురువారం (నవంబర్ 19) భారీ లాభాలతో దూసుకొనివెళ్ళాయి.. బీఎస్‌ఈ సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల మేర దూసుకొనివెళ్ళి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 25,500 మార్కును దాటి స్థిరపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex): క్రితం ముగింపు 82,031.81తో పోలిస్తే ఈరోజు 82,074.16 వద్ద లాభాలతో ప్రారంభమైంది. చివరకు 989.94 పాయింట్లు లాభపడి 83,021.75 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (Nifty 50): నిన్నటి ముగింపు 25,227.95 కాగా, ఈరోజు 25,186.80 వద్ద స్వల్ప నష్టాలతో మొదలైంది. కనిష్ఠంగా 25,104.80 స్థాయిని తాకిన తర్వాత క్రమంగా పుంజుకుని, గరిష్ఠ స్థాయి 25,514.30 వద్ద (286.35 పాయింట్లు లాభంతో) ముగిసింది.బ్యాంక్ నిఫ్టీ (Bank Nifty) చరిత్రలో తొలిసారిగా 63,000 మార్కు పైన ముగిసి సరికొత్త రికార్డు సృష్టించింది.
