సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం భీమవరం ఎంపిపిగా బస్వాని లక్ష్మీ నరసమ్మ, వైస్ ఎంపీపీగా లోకం పాండురంగారావు, వీరవాసరం ఎంపిపిగా బోగిరెడ్డి శ్రీనివాస్, వైస్ ఎంపిపిగా యరకరాజు గోపాలకృష్ణ లతోపాటు ఆయా మండల కూటమి పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు, ఇద్దరు వైసీపీ ఎంపీటీసీలుతో కల్సి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిని ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ సీతారామలక్ష్మి అభినందించి మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వంపై పాలనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని అన్నారు. పదవులు మరింత బాధ్యతలను పెంచుతాయని, సమిష్టి కృషితో స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమంతోపాటు గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూస్తే ప్రజల కూటమి పార్టీలను అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *