సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో .బంగారం, వెండి ధరలు వరుసగా మూడో రోజు ( నేడు, శుక్రవారం )కూడా భారీగా పడిపోయాయి. నేడు, శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో( విజయవాడ, హైదరాబాద్ మర్కెట్స్ ఆధారంగా) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.5120 తగ్గగా రూ.1,25,570కు చేరింది, ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే .. 22 క్యారెట్ల బంగారంపై రూ.4700 మేర ధర తగ్గింది. 10 గ్రాముల ధర రూ.1,15,100 వద్దకు దిగివచ్చింది మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. . ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.1లక్ష 75 వేల రూపాయలకు దిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *