సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని నేడు శనివారం దర్శించుకున్న భక్తులు కలవపూడి కి చెందిన వేటుకూరి రాజేంద్ర శృతి దంపతులు 50,000 రూపాయలు కానుకగా దేవాలయంలో జరిగే నిత్యాన్నదాన వితరణకు సమర్పించారు. అలాగే శ్రీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్ట్ కి భీమవరంకి చెందిన పి శ్రీనివాస్ రావు శ్రీదేవి దంపతులు 8 గ్రాముల 200 మిల్లిల బంగారం కానుకగా అందజెయ్యడం జరిగింది. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజ ఆశీర్వచనం నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరి సూర్య ప్రకాష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారు
